26-04-2025 01:04:25 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: పహల్గాం ఉగ్రదాడితో అప్రమత్తమైన భద్రతా బలగాలు జమ్మూ కశ్మీర్‌లో సాగిస్తున్న ఉగ్రవేటలో కీలక విజయం సాధించాయి. లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టాయి. పహల్గాం దాడిలో పాల్గొన్న వారికో సం జల్లెడ పడుతున్న భద్రతా బలగాలకు బందిపొరాలో అల్తాఫ్ ఆచూకీ తెలిసింది. శుక్రవారం ఉదయం ఆర్మీ దళాలు జా యింట్ ఆపరేషన్ చేపట్టాయి.
ఈ క్రమంలో ఉగ్రవాదులను గుర్తించడంతో ఎన్‌కౌంటర్ మొదలైంది. తొలుత ఒక ఉగ్రవాది గాయపడగా.. ఆ తర్వాత ముష్కరులు జరిపిన దాడు ల్లో భద్రతాదళంలో ఇద్దరికి తూటాలు తగిలాయి. ఈ క్రమంలోనే అల్తాఫ్‌ను చుట్టుము ట్టిన భద్రతా బలగాలు కాల్పులు జరిపి హతమార్చారు.
అనంతరం గాయపడిన పోలీసుల ను వెంటనే ఆసుపత్రికి తరలించి, అల్తాఫ్ లల్లీ మృతదేహాన్ని కూడా స్వాదీనం చేసుకున్నారు. కాగా ఇప్పటికీ ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కశ్మీర్‌లో అడుగుపెట్టిన వేళ ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం.