లండన్: మహిళల వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన బార్బోరా క్రెజికోవా ర్యాంకింగ్స్‌లో టాప్ అడుగుపెట్టింది. సోమవారం వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో క్రెజికోవా 22 స్థానాలు ఎగబాకి పదో స్థానంలో నిలిచింది. రన్నరప్‌గా నిలిచిన ఇటలీ సంచలనం జాస్మిన్ పవోలిని ఐదో ర్యాంకులో నిలిచి కెరీర్ బెస్ట్ అందుకుంది. సింగిల్స్ విభాగంలో స్వియాటెక్, గాఫ్, సబలెంకాలు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
పురుషుల సింగిల్స్ విభాగంలో వరుసగా రెండోసారి వింబుల్డన్ విజేతగా నిలిచిన కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) ర్యాంకులో ఏ మార్పు లేదు. అల్కరాజ్ మూడో ర్యాంకులో నిలవగా.. క్వార్టర్స్‌లో ఓడినప్పటికీ జానిక్ సిన్నర్ (ఇటలీ) నంబర్‌వన్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. వింబుల్డన్ రన్నరప్‌గా నిలిచిన నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) రెండో స్థానంలోనే కొనసాగుతున్నాడు.