calender_icon.png 9 January, 2025 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హమాస్ టాప్ కమాండర్ హతం

02-01-2025 02:48:31 AM

తాజాగా జరిపిన డ్రోన్ దాడిలో అబ్ద్ అల్ హదీ మరణించినట్టు వెల్లడి

న్యూఢిల్లీ, జనవరి 1: హమాస్ టాప్ కమాండర్‌లలో ఒకరైన అబ్ద్ అల్ హదీ సబాను హతమార్చినట్టు ఇజ్రాయెల్ ఆర్మీ మంగళవారం ప్రకటించింది. అక్టోబర్ 7న తాము జరి పిన డ్రోన్ దాడిలో ఖాన్ యూనిస్‌లో హమాస్ ఎలైట్ నుఖ్బా ఫోర్స్ కమాండర్ అబ్ద్ అల్ హదీ మరణించినట్టు గుర్తించామని వెల్లడించింది.

ఇజ్రాయెల్‌లోని కిబ్బత్జ్ నిర్ ఓజ్‌పై జరిగిన ఉగ్రదాడికి అతడు నాయకత్వం వ హించినట్టు పేర్కొంది. ఆ సమయం లో ఉగ్రవాదులు పదుల సంఖ్యలో ప్రజలను కిడ్నాప్ చేసి, హత మార్చినట్టు వెల్లడించింది. అంతేకాకుండా బీరట్‌లోని హమాస్ నాయకుడు సలేహ్ అరౌరీ హత్య వెనక తమ హస్తం ఉందని మొదటిసారిగా ఇజ్రాయెల్ అంగీకరించింది.

కాగా గాజాపై ఇజ్రాయెల్ దాడి కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ 7, 2023 నుంచి ఇప్పటి వరకూ 45వేల మందికిపైగా పాలస్తీన ప్రజలు మరణించగా, లక్ష మందికిపైగా గాయపడ్డట్టు పాలస్తీన ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది.