24-03-2025 12:23:35 AM
కడ్తాల్, మార్చి 23 ( విజయక్రాంతి): వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను మహిళా రైతులకు రాయితీపై అందించాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఇప్పటికే 13 రకాల యాంత్రీకరణ పరిక రాలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం వ్యవ సాయ యాంత్రీకరణ పరికరాలను ఇవ్వాలని నిర్ణయించింది.
వీటన్నింటిని 50 శాతం రాయి తీలో మహిళా రైతులకు మాత్రమే ఇవ్వాలని నిబంధన విధించడంతో పాటు ఈ నెలాఖరులోగా గ్రౌండింగ్ చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకువ్యవసాయ శాఖ కడ్తాల్, ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి మండలాల వారీగా పరికరాలను, నిధులను కలెక్టర్ అనుమ తిలోకేటాయించారు. మండలాల వారీగా మహిళా రైతులను ఎంపిక చేయనున్నారు.
లబ్ధిదారుల ఎంపిక కత్తిమీద సాము..
2018 నుంచి వ్యవసాయ యాంత్రికరణ పథకం నిలిచిపోయింది. దీంతో రైతు లు వ్యవసాయ పరికరాలు కొను గోలు చేయాలంటే నానా ఇబ్బం దులు పడాల్సి వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ పథ కాన్ని పునరుద్ధరించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తు న్నారు. రాయితీ పరికరాల కోసం మహిళా రైతుల నుంచి తీవ్ర పోటీ ఏర్పడే అవకాశం ఉం ది. దీంతో లబ్ధిదారుల ఎంపిక వ్యవసాయ అధికారులకు కత్తిమీది సాములా మారనుంది. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కు వగా ఉండే అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన రైతులను గుర్తించి ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
లబ్ధిదారులను ఎంపిక చేస్తాం
వ్యవసాయ యాంత్రికరణ పరికరాల గ్రౌండింగ్ను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మండలంలో వర్గాల వారీగా పరికరాలతో పాటు నిధుల కేటాయింపు పూర్తి చేశాం. త్వరలో మహిళా లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి పరికరాల గ్రౌండింగ్ చేస్తాం.
శ్రీలత, మండల వ్యవసాయశాఖ అధికారిని, కడ్తాల్ మండలం