18-02-2025 07:14:17 PM
నిర్మల్ (విజయక్రాంతి): విద్యాశాఖ ఆధ్వర్యంలో భవిష్య కేంద్రంలో ఉపకరణాల వల్ల బోధన నిర్వహించాలని జిల్లా సమన్వయకర్త ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం వివిధ కేంద్రాలను సందర్శించి పిల్లలకు అందిస్తున్న విద్యా బోధనపై అడిగి తెలుసుకున్నారు. సోను మండల విద్యా వనరుల కేంద్రంలో బోధన పరికరాల ఆవశ్యకతపై సిబ్బందికి సూచనలు చేశారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పరమేశ్వర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.