calender_icon.png 18 October, 2024 | 10:02 PM

ఆగస్టు 2న ‘తుఫాన్’

28-07-2024 12:05:00 AM

హీరో విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ ‘తుఫాన్’ ఆగస్టు 2న విడుదల చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి.లలిత, బి.ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్న ఈ సినిమాకు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించగా.. డైరెక్టర్ కరుణాకరన్, నిర్మాత జి.ధనుంజయన్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. “బాహబలి’ తర్వాత తెలుగు సినిమాల రేంజ్ పెరిగింది. నాకు ప్రతి తెలుగు సినిమా ఇష్టమే. హైదరాబాద్‌తో, తెలుగు ప్రేక్షకులతో మంచి అనుబంధం ఉంది. ‘తుఫాన్’తో మరింత దగ్గరవుతానని ఆశిస్తున్నా” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర దర్శక నిర్మాతలతోపాటు సంగీత దర్శకుడు అచ్చు రాజమణి, మాటలు రచయిత భాష్యశ్రీ, గాయకుడు సాకేత్ కొమండూరి, నటుడు సత్యరాజ్ మాట్లాడారు.