05-03-2025 12:41:51 AM
కొండపాక : కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో అక్రమంగా డంపు చేసిన 30 టన్నుల ఇసుకను టాస్క ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి... అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రేగులపల్లి పద్మారెడ్డి వ్యవసాయ పొలం వద్ద దందుగుల కనకయ్య అనే వ్యక్తి ఇసుకను అక్రమంగా డంపు చేశాడు. ఎలాంటి అనుమతులు లేకుండా డంపు చేయడంతో నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.