calender_icon.png 18 March, 2025 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు రేపు ఆఖరి తేది

18-03-2025 05:37:46 PM

కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చన్న..

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణం రాజీవ్ నగర్ లోని మోడల్ స్కూల్ (ఆదర్శ పాఠశాల)లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 20వ తేదీ ఆఖరు అని కళాశాల ప్రిన్సిపాల్ ముత్యం బుచన్న మంగళవారం వెల్లడించారు. పాఠశాలలో ఆరవ తరగతిలో ప్రవేశాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. 6వ తరగతిలో 100 సీట్లున్నాయని, ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్న ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. మంచిర్యాల, నస్పూర్, హజిపూర్ మండలాల అర్హులైన ఆసక్తిగల అభ్యర్థులు వెబ్ సైట్ telanganams.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఏప్రిల్ 27న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 99490 15156లో సంప్రదించవచ్చునని అన్నారు.