calender_icon.png 18 April, 2025 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు వీర హనుమాన్ విజయ యాత్ర

10-04-2025 11:02:52 PM

మంచిర్యాల (విజయక్రాంతి): విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈ నెల 12న మంచిర్యాలలో వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రేవల్లి రాజలింగు తెలిపారు. గురువారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... శనివారం సాయంత్రం 5 గంటలకు మంచిర్యాలలోని హనుమాన్ జంక్షన్ ఐబీ చౌరస్తా నుంచి ఈ యాత్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ విజయ యాత్రలో మాలధారణ చేసిన వారు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి వేముల రమేష్, ఉపాధ్యక్షురాలు గొట్టిపర్తి కనకతార, విద్యాసాగర్, సురేష్, ముత్యం పద్మ, ముత్యం సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.