calender_icon.png 24 January, 2025 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు కొండపల్లి శేషగిరిరావు శత జయంతి

24-01-2025 01:50:15 AM

స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్‌లో పెయింటింగ్ ఎగ్జిబిషన్

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 23(విజయక్రాంతి): ప్రముఖ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు శత జయంతిని శనివారం నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మాదాపూర్ కావూరి హిల్స్ రోడ్‌నెంబర్ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్‌లో నిర్వహించే ఈ ప్రోగ్రామ్‌కు ముఖ్యఅతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, విశిష్ట అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం, సాంస్కృతిక శాఖ కార్యదర్శి స్మితాసబర్వాల్, తెలంగాణ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ డైరెక్టర్ డాక్టర్ కే లక్ష్మి, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు ఎంవీ రమణారెడ్డి తదితరులు పాల్గొంటాని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్‌లో పెయింటింగ్ ఎగ్జిబిషన్‌ను వారు ప్రారంభిస్తారని వెల్లడించారు.