calender_icon.png 27 September, 2024 | 9:44 AM

రేపు నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవం

27-09-2024 01:24:01 AM

హాజరుకానున్న రాష్ట్రపతి, గవర్నర్, సీఎం

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 26(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్‌లోని నల్సార్ న్యాయ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవం శనివారం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పాల్గొని ప్రసంగించనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, సుప్రీం కోర్టు జడ్జి పీఎస్ నర్సింహ పాల్గొననున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నల్సార్ యూనివర్సిటీ ఛాన్సలర్ అశోక్‌అరాధే అధ్యక్షతన ఈ కాన్వకేషన్ జరుగనుంది. ఈ సందర్భంగా నల్సార్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు వార్షిక నివేదికను సమర్పించనున్నారు. స్నాతకో త్సవం సందర్భంగా ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బీ ఆనర్స్, ఎంబీఏ, బీబీఏ కోర్సుల్లో ప్రతిభచాటిన 57 మంది విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్ అందజేయనున్నారు. పీహెచ్‌డీ, పీజీ, డిగ్రీ కోర్సుల్లో 592 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేస్తారు.