calender_icon.png 28 January, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు జెన్‌కో ఏఈ పరీక్ష

13-07-2024 12:31:47 AM

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): టీజీ జెన్‌కో అసిస్టెంట్ ఇం జినీర్ (వివిధ విభాగాల్లో), కెమిస్ట్ పరీక్షను ఆదివారం నిర్వహించనున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో దీని కి సంబంధించిన నోటిఫికేషన్‌ను టీజీ జెన్‌కో జారీ చేసింది. మూడు విడుతల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)ను నిర్వహించనున్నారు. మెకా నికల్, కెమిస్ట్ అభ్యర్థులకు సెషన్ ఉదయం 9 నుంచి 10.40 గంటల వరకు, ఎలక్ట్రికల్ అభ్యర్థులకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.40 వరకు, సివిల్, ఎలక్ట్రానిక్స్ అభ్యర్థులకు సా.5 నుంచి 6.40 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్టు జెన్‌కో ఎండీ తెలిపారు. కనీసం 2 గంటలు ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, 15 నిమిషాలు ముందే గేట్లు క్లోజ్ చేయను న్నట్టు స్పష్టంచేశారు.