calender_icon.png 31 March, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు ఎర్త్ అవర్

21-03-2025 12:00:00 AM

గంట పాటు విద్యుత్ దీపాల ఆర్పివేత

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి):  ఎర్త్ అవర్‌ను ప్రతీ ఏటా మార్చిలో నిర్వహించడం ఆనవాయితీ. గ్లోబల్ వార్మింగ్ కారణంగా జీవరాశి ఉనికి ప్రశ్నార్థకంగా మారినందున ‘భూమిని కాపాడుకుందాం... పర్యావరణాన్ని రక్షించుకుందాం’ అని పిలుపునిచ్చిన పర్యావరణవేత్తలు ఎర్త్ అవర్‌కు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది మార్చి 22న ఎర్త్ అవర్‌ను పాటించనున్నారు.

సాధారణం గా ఏటా మార్చి చివరి శనివారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వర కు ఎర్త్ అవర్‌ను పాటిస్తారు. ఈక్ర మం లో వేసవి ప్రభావంతో రాష్ర్టంలో గతం లో ఎప్పుడు లేనంతగా విద్యుత్ డిమాం డ్ పెరిగిందని ప్రతి ఒక్కరూ ఎర్త్ అవర్ పాటించి విద్యుత్ పొదుపు చేయాలని రాష్ర్ట ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నక్క యాదగిరి,  1104 యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు జి.సాయిబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.