హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (విజయక్రాంతి) : జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు, కార్మికుల కోసం మంగళవారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించనున్నామని కమిషనర్ ఆమ్రపాలి కాట తెలిపారు. కిమ్స్, సన్‌షైన్ హాస్పిటల్స్ సహకారంతో టీమ్ విమలాకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ విమలాకర్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక క్యాంప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి సర్కిల్, జోనల్ అధికారులతో పాటు ఆయా విభాగాల హెచ్‌ఓడీ అధికారులు, సిబ్బంది, కార్మికులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు ప్రధాన కార్యాలయంలో జరిగే క్యాంప్‌కు హాజరుకాగలరని కోరారు.