టాలీవుడ్‌లోని మహిళలపై వేధింపులు, సమస్యలపై పోరాడేందుకు 2019లో ఓ సబ్ కమిటీ ఏర్పాటైంది. ‘ది వాయిస్ ఆఫ్ ఉమెన్’ పేరుతో ఏర్పాటైన ఆ సబ్ కమిటీని ఉద్దేశించే నటి సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. టాలీవుడ్‌లో రూపొందించిన సబ్ కమిటీ నివేదికను వెల్లడించాలని ఆమె తన పోస్ట్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన జస్టిస్ హేమ నివేదికను ఆమె స్వాగతించారు. కేరళలో ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) చేస్తున్న కృషిపై ప్రశంసలు కురిపించారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనూ అలాంటి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఓ మలయాళ నటిపై లైంగిక వేధింపుల నేపథ్యంలో వారికి అండగా నిలిచేందుకు 2017లో ఏర్పాటైన డబ్ల్యూసీసీ విజ్ఞప్తి మేరకు అక్కడి సర్కారు 2019లో జస్టిస్ హేమ కమిటీని నియమించింది. ఇటీవల వెలువరించిన ఆ కమిటీ నివేదికలో విస్తుపోయే విషయాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంత చేసిన పోస్ట్ వైరల్‌గా మారాయి.