calender_icon.png 9 January, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాలీవుడ్ లేడీ డైరెక్టర్ మృతి

04-01-2025 12:00:00 AM

టాలీవుడ్ దర్శకురాలు అపర్ణ మల్లాది (54) క్యాన్సర్‌తో మృతి చెందారు. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజె ల్స్‌లో ఉంటున్న అపర్ణ తాజాగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లిన అపర్ణ అక్కడ వైద్యం తీసుకున్నా లాభం లేకపోయింది. అపర్ణ మరణ వార్త తో ఆమె కుటుంబంలోనూ.. టాలీవుడ్‌లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి.

అపర్ణ మర ణం పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు సం తాపం వ్యక్తం చేస్తున్నారు. అపర్ణ తొలుత ‘ది అనుశ్రీ ఎక్స్‌పెరిమెంట్స్’ పేరుతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అది పెద్దగా వర్కవుట్ కాలేదు. ఆ తరువాత నటి, రచయితగా, నిర్మాతగా కూడా వ్యవహరిం చారు. ‘పోష్ పోరిస్’, ‘పెళ్లికూతురు పార్టీ’ అనే రెండు వెబ్ సిరీస్‌లకు దర్శకత్వం వహించారు. ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా.. ‘కేరాఫ్ కంచరపాలెం’ వంటి చిత్రాలు తెర మీదకు రావడానికి ఆమె కృషి చేశారు.