calender_icon.png 10 October, 2024 | 8:53 AM

తోళ్లవాగు.. అక్రమార్కులపాలు?

09-10-2024 12:00:00 AM

పెద్ద వాగును చిన్న కాల్వలుగా మారుస్తున్న కబ్జాదారులు 

బఫర్ జోన్‌లోనే విచ్చలవిడిగా నిర్మాణాలు 

మంచిర్యాల, అక్టోబర్ ౮ (విజయక్రాంతి) : మంచిర్యాల పట్టణంలోని తోళ్లవాగు రానురాను మురుగు కాలువలా మారుతోంది. తోళ్లవాగు అటు మంచిర్యాల మున్సిపాలిటీ కి, ఇటు నస్పూర్ మున్సిపాలిటీకి మధ్య ఉం డగా రెండు ప్రాంతాలకు చెందిన అక్రమార్కులు రెండు వైపులా కబ్జా చేసి, నిర్మాణాలు చేస్తున్నారు. బఫర్‌జోన్‌ను ఏమాత్రం పరిశీలించకుండా మున్సిపాలిటీల కమిషనర్లు లక్షల్లో మామూళ్లు తీసుకుంటూ ఇంటి నిర్మాణాలకు అనుమతి ఇచ్చేస్తున్నారు. 

రెచ్చిపోతున్న రియల్టర్లు

జిల్లాకేంద్రంలోని తిలక్‌నగర్ చెరువు ఎఫ్‌టీఎల్ లెవల్‌లో, తోళ్లవాగు బఫర్ జోన్‌లో రియల్టర్లు వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న స్థలంలోనైతే వాగుకు ఇరువైపు లా కొన్ని మీటర్ల లోతులోకి వచ్చి నిర్మాణాలు జరిపినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. మరోవైపు వాగుకు సమీపానే ఇరిగేషన్ శాఖ కార్యాలయం ఉన్నప్పటికీ ఆశాఖ అధికారులు సైతం దృష్టిసా రించడం లేదు. దీనితో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.

అధికారులపై చర్యలు తీసుకోవాలి

కబ్జాదారులు వా గులో మట్టి పోసి ఆక్రమించుకుంటున్నారు. వాగు ఆక్రమణకు గురికావడంతో వానకాలంలో నీరంతా ఇండ్లలోకి చేరుతుంది. దీనితో ప్రజలు భ యాందోళనకు గురవుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆర్థిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వాగులో మట్టిపోసి కబ్జాలు చేస్తున్నారు.

వారి నుంచి వాగును రక్షించాలని కలెక్టర్ కుమార్ దీపక్‌కు సైతం వినతి పత్రం అందజేశా. భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ము న్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. తోళ్లవాగుకు ఇరువైపులా నిర్మించి న బహుళ అంతస్తుల భవనంతోపాటు ఇ ండ్లను తొలగించాలి. తోళ్లవాగు బఫర్‌జోన్‌ను కాపాడాలి. కలెక్టర్ చొరవ చూపాలి. 

 నల్ల నాగేంద్ర ప్రసాద్, 

ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్, మంచిర్యాల