calender_icon.png 28 April, 2025 | 12:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబ్బులు అడిగినందుకు టోల్ గేట్ సిబ్బందిపై దాడి

16-04-2025 12:05:37 AM

రంగారెడ్డి కలెక్టరేట్ జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్ సిద్ధికి దౌర్జన్యం

రాజేంద్రనగర్, ఏప్రిల్ 16: డబ్బులు అడిగినందుకు టోల్ గేట్ సిబ్బందిపై ఓ ప్రభుత్వ ఉద్యోగి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రాజేంద్రనగర్ లోని ఎగ్జిట్ నెంబర్ 17 వద్ద మంగళవారం జరిగింది. తన కారుకు టోల్ మినహాయింపు ఇవ్వాలని జూనియర్ అసిస్టెంట్  హుస్సేన్ సిద్ధికి కోరాడు.

అందుకు నిరాకరించిన సిబ్బంది టోల్   చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. వాహనం ఆపినందుకు టోల్ సిబ్బందిపై ఆగ్రహంతో హుస్సేన్ సిద్ధికి తోపాటు ఆయన కుటుంబ సభ్యులు దాడి చేశారు. గొడవను అడ్డుకోబోయిన ఇతర టోల్ సిబ్బందిపై సైతం హుస్సేన్ సిద్ధికి దౌర్జన్యానికి దిగాడు.

రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా హుస్సేన్ సిద్ధికి పనిచేస్తున్నాడు. హుస్సేన్ సిద్ధికి తోపాటు అతని కుటుంబ సభ్యులపై టోల్ సిబ్బంది రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా   పోలీసులు విచారణ చేస్తున్నారు.