calender_icon.png 15 January, 2025 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పథకాల్లో పారదర్శకత కోసం టోల్ ఫ్రీ నెంబర్

15-01-2025 07:19:37 PM

నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) న్యాయకత్వంలో ఉన్న ప్రజా పాలన ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం జనవరి 26 నుంచి కొత్త పథకాలను అందించేందుకు పారదర్శకంగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అన్నారు. బుధవారం పథకాల అమలుపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులకు ఎకరానికి 12000 పెట్టుబడి సాయం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అర్హులు వారికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇతర పథకాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపడం జరుగుతుందన్నారు. పథకాల అమలులో పూర్తిగా పారదర్శకత పాటించడం జరుగుతుందని తెలిపారు. ఏవైనా సందేహాలు ఉంటే ప్రజలకు వాటిని తీర్చేందుకు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు 63056 466 00 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలని సూచించారు.