calender_icon.png 21 February, 2025 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టోల్ ఫ్రీ నంబర్ ను సద్వినియోగం చేసుకోవాలి

20-02-2025 05:00:40 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ సుదర్శనం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ సిబ్బంది అన్ని ప్రాంతాల్లో 24 గంటల సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. లో వోల్టేజి ఉంటే సమస్య. సిబ్బంది పనితీరు విద్యుత్ సరఫరాలో అంతరాయం తదితర సమస్యలు ఉంటే వినియోగదారులు 1912 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. విద్యుత్ పొదుపుగా వాడుకోవాలని వినియోగదారులకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.