31-03-2025 01:03:46 PM
హైదరాబాద్: ఓఆర్ఆర్ ప్రయాణికులకు ఇది ఖచ్చితంగా చేదువార్తే. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు(Hyderabad Outer Ring Road)పై టోల్ ఛార్జీలు పెరిగాయి. రేపటి నుంచి పెరిగిన ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు(ORR toll charges hiked) అమల్లోకి రానున్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. కారు, జీపు, లైట్ వాహనాలకు కిలో మీటర్ కు రూ. 2.34 నుంచి రూ. 2.44 పెరగగా, మినీ బస్, ఎల్ వోసీలకు కిలో మీటర్ కు రూ.3.77 నుంచి రూ. 3.94కు పెరిగింది. ఐఆర్ బీ ఇన్ ఫ్రా సంస్థ ఓఆర్ఆర్ పై టోల్ వసూలు చేస్తుంది.
ఔటర్ రింగ్ రోడ్డుపై ఏ వాహనాలపై ఎంత పెరిగిందంటే
కారు, జీపు, వ్యాన్, లైట్ వాహనాలకు కిలో మీటర్ కు 10పైసలు పెంపు.
మినీబస్, ఎల్ సీవీలకు కిలో మీటర్ కు 20 పైసలు పెంపు.
2 యాక్సిల్ బస్సులకు కిలీ మీటర్ కు రూ. 6.69 నుంచి రూ. 7కు పెంపు.
భారీ వాహనాలకు కిలీ మీటర్ కు రూ. 15.09 నుంచి రూ. 15,78కు పెంపు.