వారంలోగా లబ్ధిదారులకు అప్పగించాలి
అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 3(విజయక్రాంతి): దళితబంధు నిధులు దారి మళ్లితే సహించేది లేదని, దారిమళ్లిన వాటిని వారంలోగా అసలైన లబ్ధిదారులకు అప్పగించా లని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన భట్టి మధిర నియోజకవర్గంలోని చింతకాని మండల కేంద్రంలో దళితబంధు పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. దళితబంధు దుర్వినియోగంలో లబ్ధిదారుడి పాత్ర ఉం టుందో, ప్రత్యేక అధికారులకు అంతే ప్రాత ఉంటుందన్నారు.
మొదటి దశ విజయవంతంగా పూర్తి చేసిన దళితబంధు లబ్ధిదా రులకు వారంలోగా రెండో దశ నిధులు విడుదల చేస్తామన్నారు. దళితబంధు పథకానికి చింతకాని మండలం శాచ్యురేషన్ పద్ధతి లో ఎంపికైందని, అన్ని గ్రామాల్లో ప్రత్యేక అధికారులు పర్యటించి లబ్ధిపొందిన వారిని గుర్తించి వివరాలు సేకరించాలని ఆదేశించా రు. దళితబంధు యూనిట్లు దారి మల్లాయో లేదో వారంలోగా గుర్తించి తిరిగి లబ్ధిదారులకు అందించాలని ఆదేశించారు. దళితబం ధు యూనిట్లు బదిలీ చేసినా, అమ్మినా నేరం చేసినట్టేనని చెప్పారు. లబ్ధిదారులకు స్మాల్ స్కేల్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఇండస్ట్రియల్ పార్కును మంజూరు చేస్తామ ని భట్టి చెప్పారు. దళితబంధు యూనిట్‌గా పొందిన జేసీబీలు, ట్రాలీలను ఇరిగేషన్ పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి పనుల్లో ఉపయోగించాలన్నారు. యూనిట్ల పనితీరుపై క లెక్టర్‌కు సమాచారమివ్వాలని సూచించారు.
ఎల్‌ఆర్‌ఎస్‌తో ఇబ్బంది కలగొద్దు
రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎల్‌ఆర్‌ఎస్(ల్యాండ్ రెగ్యులేషన్ స్కీం)పై త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్ల కలెక్టర్లను ఆదేశించారు. శనివారం ఖమ్మం కలె క్టరేట్ నుంచి భట్టి, భూపాల్‌పల్లి ఐడీవో సీ నుంచి రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి వీడి యో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రం లో పెండింగ్‌లో ఉన్న 25 లక్షల దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరిం చాలని ఆదేశించారు.
దరఖాస్తు ల పరిష్కారం కోసం అవసరమైతే అదనపు సిబ్బందిని డిప్యూటేషన్ ద్వారాగానీ, ఔట్ సోర్సింగ్ విధానంలోగానీ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్, రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి దానకిషోర్ పాల్గొన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు, వాటి ప్రస్తుత స్థితిగతులు, ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ పూర్తి చేసేందుకు నిర్దేశించుకున్న ప్రణాళికపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు.