రూ.31.86 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27 (విజయక్రాంతి): ఫెడెక్స్ కొరియర్‌లో నిషేధిత వస్తువులు ఉన్నాయని భయపెట్టి ఓ వ్యక్తిని భయపెట్టి సైబర్ నేరగాళ్లు రూ.31.86 లక్షలను కాజేశారు. సైబర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి ఇటీవల ఫెడెక్స్ కొరియర్ సర్వీసెస్ ప్రతినిధి అంటూ ఓ వ్యక్తి కాల్ చేశాడు.
ఇరాన్‌కు వెళ్తున్న ఓ పార్శిల్‌లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని, అలాగే పార్సిల్‌లో రెండు గడువు ముగిసిన పాస్‌పోర్ట్‌లు, మూడు హార్డ్ డిస్క్‌లు, 5.5 కిలోల మెడిసిన్ లభిం చాయన్నాడు. దీంతో బ్యాంకు ఖాతాపై మనీలాండరింగ్ కేసు నమోదైదని ఉద్యోగిని భయపెట్టాడు. ఈ కేసును సీబీఐ అధికారికి బదిలీ చేస్తున్నమని, కేసు నుంచి బయటపడాలంటే తాము అడిగిన వివరాలు చెప్పమని అడిగాడు.
దీంతో ఉద్యోగి ఖాతాకు సంబంధించిన వివరాలన్నీ చెప్పాడు. 24 గంటల తర్వాత ఉద్యోగి బ్యాంకు ఖాతా నుంచి రూ. 31.86 లక్షలు కాజేశారు. తర్వాత అవతలి వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపో యానని గ్రహిం చిన బాధితుడు బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.