calender_icon.png 31 October, 2024 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రేడింగ్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో టోకరా

03-07-2024 12:05:00 AM

రూ.16.43 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 2 (విజయక్రాంతి): నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి (39) తన మొబైల్ చూస్తుండగా ట్రేడింగ్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో వాట్సాప్‌లో ఒక అడ్వర్టుజ్‌మెంట్ మెసేజ్ వచ్చింది. ట్రేడింగ్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలంటే అందులో రిజిస్టర్ కావాలని బాధితుడికి సూచించారు. అలాగే ఓ లింక్ పంపి డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. దీంతో బాధితుడు మనీసూఖ్ అనే పేరు గల గ్రూప్‌లో జాయినయ్యాడు. గ్రూపులో ఉన్నవారు ట్రేడింగ్‌లో భారీగా డబ్బులు సంపాదించినట్లు చేసిన మెసేజ్‌లు చూసి నిజమని నమ్మిన బాధితుడు, పలు దఫాలుగా రూ.16,43,557 పెట్టుబడిగా పెట్టాడు. వచ్చిన లాభాలను విత్‌డ్రా చేసుకోవడానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని సైబర్ నేరగాళ్లు బాధితుడిని నమ్మించారు. దీంతో మోసపోయానని గ్రహించి మంగళవారం సీసీఎస్ కార్యాలయంలోని సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. 

మరో కేసులో రూ.1.14 లక్షలు స్వాహా.. 

మరో కేసులో హైదరాబాద్‌కి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి (30) ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా, కార్డు వచ్చింది. దీంతో అతను కార్డు యాక్టివేట్ చేసుకున్నాడు. కానీ తనకు తెలియకుండానే కార్డు నుంచి మూడు లావాదేవీల్లో మొత్తం రూ.1,14,259 డెబిట్ అయ్యాయని మెసేజ్ వచ్చింది. బాధితుడు ఆ కార్డును ఉపయోగించలేదు. ఎలాంటి ఓటీపీలు అందుకోలేదు. దీంతో యాక్సిస్ బ్యాంక్‌లో ఫిర్యాదు చేయడంతో అధికారులు అతని కార్డును బ్లాక్ చేశారు. కానీ, బాధితుడు తన మొబైల్ ఫోన్ చూడగా ‘ట్రాన్సాక్షన్ చేసినందుకు ధన్యవాదాలు, మేము మీ యాక్సిక్ బ్యాంక్ క్రెడిట్ కార్డు అన్‌బ్లాక్ చేశాం, మాతో సురక్షితమైన బ్యాంకింగ్ ప్రయాణాన్ని అనుభవించండి’ అనే సందేశం కనిపించింది. దీంతో బాధితుడు తన క్రెడిట్ కార్డులో నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బు కాజేశారని తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.