calender_icon.png 20 September, 2024 | 8:17 AM

ఉద్యోగం పేరుతో టోకరా

19-09-2024 12:12:40 AM

బ్యాంకు ఖాతా నుంచి రూ.3.66 లక్షలు హుష్

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి):  మంచి ఉద్యోగం.. లక్షల్లో జీతం ఇప్పిస్తానని సైబర్ నేరగాళ్లు ఓ ఉద్యోగికి వల వేశారు. ఆ సైబర్ వలకు చిక్కి బాధితుడు రూ.3.66 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటకు వెచ్చింది. నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి ఇటీవల 83748 78171 అనే నంబర్ నుంచి కాల్ వచ్చింది. తాను ప్రముఖ కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నట్లు కాలర్ నమ్మబలికాడు. తాను నెలకు రూ.లక్షల్లో వేతనం వచ్చే ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పాడు.

కాలర్ మాటలకు ఆకర్షితుడైన ఉద్యోగి కొలు వు రావాలంటే ఏం చేయాలని అడిగాడు. దీంతో కాలర్ తనకు ముందుగా రూ.47 వేలు చెల్లించాలన్నాడు. ఆ తర్వాత కాలర్ నకిలీ జాబ్ ఆఫర్ లెటర్ పంపించి, మరో రూ.3.19 లక్షలు చెల్లించాలని సూచించాడు. దీంతో ఉద్యోగి కాలర్ చెప్పినంత డబ్బు జమ చేశాడు. అనంతరం కాలర్ మరో నకిలీ ఆఫర్ లెటర్ పంపించాడు. కొద్దిరోజుల తర్వాత కాలర్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్ర యించాడు.  పోలీసులు సైబర్ క్రైం కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.