calender_icon.png 29 September, 2024 | 6:52 PM

పార్ట్‌టైం జాబ్ పేరుతో టోకరా

28-09-2024 12:00:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): పార్ట్‌టైం జాబ్ పేరుతో ఓ వ్యక్తికి సైబర్ నేరగాళ్లు రూ.1.58 లక్షలకు టోకరా వేశారు. నగరానికి చెందిన ఓ వ్యాపారి(37)కి టెలిగ్రామ్‌లో ఆన్‌లైన్ పార్ట్‌టైం జాబ్ పేరుతో ఓ మేసేజ్ వచ్చింది. తదనంతరం స్కామర్లు రోజువారి వేతనంతో ఆన్‌లైన్ ఉద్యోగం కల్పిస్తామని googles toreinternational.com లో ఫ్రీగా లాగిన్ అయ్యి డబ్బు సంపాదించుకోవాలని సూచించారు. వారు చెప్పినట్లే లింక్ ఓపెన్ చేసి తన వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకు వివరాలను అందించాడు.

తదనంతరం బాధితుడిని తమ మాయమా టలతో ముగ్గులోకి దింపి పలు దఫాలుగా రూ.1.58 లక్షలను పెట్టుబడులుగా పెట్టించారు. అనంతరం అతడు పెట్టిన పెట్టుబడులకు భారీగా లాభాలు వచ్చినట్లు చూపించి వాటిని విత్‌డ్రా చేసుకోవడానికి రూ.5లక్షలు చార్జీలను చెల్లించాలని చెప్పారు. ఇదంతా సైబర్ మోసంలా ఉందని గ్రహించిన బాధితుడు శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈమేరకు  కేసు దర్యాప్తు చేస్తున్నారు.