calender_icon.png 25 October, 2024 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంకు ఉద్యోగినంటూ 50 వేలకు టోకరా

08-08-2024 03:50:35 AM

నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడించిన ఎప్పీ జానకీ షర్మిల

నిర్మల్ ఆగస్టు 01 (విజయక్రాంతి): సులువుగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను నిర్మల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ఏఎస్పీ అవినాష్‌తో కలిసి బుధవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు... రాజస్థాన్‌కు చెందిన శేక్ నసీంఖాన్, తస్ల్లీమ్ ఖాన్, సలీం ఖాన్ ముగ్గురు అన్నదమ్ములు.

ఈ క్రమంలో సలీంఖాన్ ఆరేళ్ల క్రితం నిర్మల్ జిల్లాలోని కుంటాల మండలం అంబకంటి గ్రామానికి వలస వచ్చి అక్కడే పనిచేకుంటూ స్థానికంగా ఉండే అభిలాష అనే యువతిని పెండ్లి చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సులభంగా డబ్బులు సంపాదించాలనే దుర్భుద్దితో తన తమ్ముల్లున షేక్ నసీంఖాన్, తస్లిమ్‌ఖాన్‌తో కలిసి సైబర్ మోసాలకు పాల్పడటం ప్రారంభించాడు. ఈ క్రమంలో కుంటాల మండల కేంద్రంలో గతనెల 24న ఏటీఎం వద్దకు వెళ్లిన.. అభిలాష తాను బ్యాంకు ఉద్యోగిని అని అక్కడ ఉన్న ఓ వ్యక్తి(గజేందర్)ను  నమ్మించి.. తనకు అత్యవసరంగా రూ.50వేలు క్యాష్ కావాలని కోరింది.

తాను ఫోన్ పే ద్వారా రూ.50వేలు చెల్లిస్తానని చెప్పింది. సలీం మరో ఇద్దరు నిందితులైన తాస్లిమ్‌ఖాన్, నషీంకాన్ నకిలీ ఖాతా యాప్ నుంచి గంగాధర్  ఫోన్‌కు రూ.50వేలు పంపినట్టు తెలిపారు. గంగాధర్‌కు దాన్ని చూపడంతో అతని వద్ద ఉన్న రూ.50వేలు వారికి ఇచ్చేశాడు. మరుసటి రోజు గజేందర్ బ్యాంకుకు వెళ్లి నగదు తీసుకొనేందుకు ప్రయత్నించగా అతడి అకౌంట్లో ఎలాంటి డబ్బులు జమకాలేదని బ్యాంకు సిబ్బంది తెలిపారు.

దీంతో మోసపోయనని గ్రహించిన గజేందర్.. కుంటాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సలీంను అదుపులో తీసుకొని విచారించగా.. మోసం చేసినట్టు ఒప్పుకున్నాడు. అతడి సహాయంతో మిగితా నిందితులను కూడా పోలీసులు అదపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 7 ఎటీఎం కార్డులు, 9 సెల్‌ఫోన్లు రాజస్థాన్‌కు చెందిన గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకొని బుధవారం రిమాండ్‌కు తరలించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, సీఐ నైలు, ఎస్‌ఐ రజనీకాంత్‌ను ఎస్పీ జానకీ షర్మిల అభినందించారు.