18-04-2025 12:00:00 AM
పాఠశాల తనిఖీల్లో డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశం
ఆదిలాబాద్, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి) : జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల సౌచాలయాలు (మరుగుదొడ్లు) వాడుకలో ఉండేలా చూడాలని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అవసరమైన చిన్న చిన్న మరమ్మతులు చేసుకోవాలని సూచించారు. యుడైస్ సర్వే పర్యవేక్షణలో భాగంగా ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలిలో ని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు.
రెండు పాఠశాలల యుడైస్ వివరాలు పరిశీలించారు. వర్షం నీరు హృదా పోకుండా ఇంకుడుగుంట త్రవ్వించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. అనంతరం ఉన్నత పాఠశాలలో పింకిష్ ఫౌండేషన్ అం దించిన నాప్కిన్ పాడ్స్ విద్యార్థులకు పంపి ణీ చేశారు. కార్యక్రమంలో ప్లానింగ్ కోఆర్డినేటర్ నారాయణ, ఎంఇఓ కంటే నర్సయ్యా, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ట్రైనీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.