calender_icon.png 11 March, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఎయిర్ ఇండియా’లో టాయిలెట్ సమస్య

11-03-2025 01:05:50 AM

న్యూఢిల్లీ, మార్చి 10: ఎయిర్ ఇండి యా విమానాల్లో వసతుల లేమి గు రించి అనేక రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఎయిర్ ఇండియాకు చెందిన  ఏఐ126 విమానం చికాగో నుంచి 300 మంది ప్రయాణికులతో మార్చి 6న బయళ్దేరింది. కానీ అందు లో ఉన్న 12 టాయిలెట్లలో 11 టాయిలెట్లు పని చేయకపోవడంతో సిబ్బంది చేసేదేంలేక విమానాన్ని వెనక్కు మళ్లించారు.

చికాగో నుంచి కొంత దూరం వచ్చిన తర్వాత ప్రయాణికులు ఘర్షణ పడటంతో సిబ్బంది చేసేదేంలేక మరలా విమానాన్ని వెనక్కు మళ్లించారు. దీంతో ప్రయాణికులు దాదాపు 10 గంటల పాటు నరకం అనుభవించారు.