calender_icon.png 3 April, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద ముస్లిం కుటుంబాలను సంతోషంగా ఉంచేందుకే ‘తోఫా’ పంపిణీ

31-03-2025 12:00:00 AM

సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా

పాల్వంచ, మార్చి 30 (విజయక్రాంతి):- రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకునేందుకే పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ తోఫాను అందిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా అన్నారు. పట్టణ పరిధిలోని 200 పేద ముస్లీంలను గుర్తించి వారికి పండుగకు అవసరమయ్యే తోఫాను ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ పేదల ఆకలిని గుర్తించి టీఎన్‌ఆర్ ట్రస్టు చైర్మన్ తాండ్ర వెంకటేశ్వర్రావు, ఆయన స్నేహితులు ఖాజీమ్ అలిలు తోఫా పంపిణికి తమ సహకారాన్ని అందించారని తెలిపారు. ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రతి ఒక్కరు కులమతాలకతీతంగా అన్ని పండుగలను జరుపుకొని ఆదర్శంగా నిలవాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం తోఫాలతో సరిపెట్టుకోకుండా ముస్లీం పేద కుటుంబాలకు అన్ని విధాలా ఆదుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు నిరుద్యోగ యువతకు శాశ్వత ఉపాధి కల్పించాలని కోరారు. ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న పాలకులు కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెడుతూ రాజకీయ పబ్బంగడుపుకునేందుకు కుట్ర చేస్తున్నారని, ఈ కుట్రలను ప్రజలు గమనించి వారి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, జిల్లా కార్యవర్గ సభ్యులు నరాటి ప్రసాద్, పట్టణ సహాయ కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్, ప్రజాసంఘాల నాయకులు బండి నాగేశ్వరావు, ఎండి అస్లాం, యూసుఫ్, అన్నారు వెంకటేశ్వర్లు, ఇట్టి వెంకట్రావు, నిమ్మల రాంబాబు, ఎండి గౌస్, బీవీ సత్యనారాయణ, వైఎస్ గిరి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.