27-03-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం మార్చ్ 26 (విజయక్రాంతి,): రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకునేందుకే పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ తోఫాను అందిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా, ముస్లీం మైనార్టీ రాష్ట్ర నాయకులు నయిం ఖురేషి అన్నారు.
సుజాతనగర్ మండలంలో పరిధిలో 150 మంది, చుంచుపల్లి మండలం ఉ మ్మడి పెనగడప జీపీలోని 75 మంది పేద ముస్లీంలను గుర్తించి వారికి పండుగకు అవసరమయ్యే తోఫాను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో వారు మాట్లాడుతూ పేదల ఆకలిని గుర్తించి టీఎన్‌ఆర్ ట్రస్టు చైర్మన్ తాండ్ర వెంకటేశ్వర్రావు, ఆయన స్నేహితులు ఖాజీమ్ అలిలు తోఫా పంపిణికి తమ సహకారాన్ని అందించారని తెలిపారు.
కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నరాటి ప్రసాద్, టీఎన్‌ఆర్ భాద్యులు తాండ్ర బుచ్చిబాబు, కోదుమూరి పుల్లారావు, సీపీఐ జిల్లా సమితి సభ్యులు భూక్యా దస్రు, కొమారి హనుమంత రావు, జక్కుల రాములు, తాళ్ల వెంకటేశ్వ రావు, హనీష్, అల్లాహ బక్షా, కృష్ణ, నీదాల సుధాకర్, తాజుద్ధిన్, మన్నే సంబశివరావు, బద్ధరావు, ఉదయ్, భాస్కర్, రవి, శ్రీను, ఖాసీం ఖాన్, రహీమ్ జానీ, జయచందర్ తదితరులు పాల్గొన్నారు