calender_icon.png 12 January, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్లు, నీరా ఉత్పత్తులను ప్రోత్సహించాలి

12-01-2025 01:16:15 AM

బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల

ముషీరాబాద్, జనవరి 11 : రెండు తెలుగు రాష్ట్రాల్లో కింగ్‌ఫిషర్ బీర్లపై నిషేధం విధించడంతోపాటు ప్రజల ఆరోగ్యం, ప్రాచీ  సంప్రదాయాలను కాపాడటానికి కల్లు, నీరా ఉత్పత్తులను ప్రోత్సహించాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ తెలుగు రాష్ట్రా సీఎంలకు విజ్ఞప్తి చేశారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో రాచాల మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో మద్యం దుకాణాల సిండికేట్  కొన్ని బ్రాండ్లతో మాత్రమే మద్యం అమ్మకాలు జరిపారని, దీనివల్లనే కింగ్‌ఫిషర్ కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్లో మోనోపలికి కారణమైందని మండిపడ్డారు.

కల్లు, నీరా వంటి సంప్రదాయ ఉత్పత్తులు గ్రామీ  ఆర్థ్ధిక వ్యవస్థకు మేలుచేస్తాయని, ఆరోగ్యపరమైనవి మాత్రమే కాకుండా, గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలను కూడా అందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఫర్ ఆడిట్ చైర్మన్ గాలిగళ్ల సాయిబాబా, బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు వనం తిరుపతయ్య యాదవ్, గుర్రం రాఘవేందర్ గౌడ్, నవీన్  పాల్గొన్నారు.