29-03-2025 01:33:00 AM
మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు
కొత్తపల్లి, మార్చి 28 (విజయ క్రాంతి): యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని, నేటి యువతే దేశానికి విలువైన సంపదని తాజా మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటో డివిజన్ తీగల గుట్టపల్లి లో జరుగుతున్న ప్రత్యేక వేసవి జాతీయ సేవా పథకం శిబిరంలో భాగంగా శుక్రవారం సంవేదన 2 అంతర్జాతీయ రక్తదాన మహోత్సవశిబిర కార్యక్రమం మాజీ కార్పొరేటర్, నిఫా రాష్ట్ర సెక్రెటరీ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందన్నారు. యువతలో అనంతశక్తి దాగి ఉందని, దేశ సంపద యువతే, దేశ శక్తి యువతే ,దేశ రక్షణ యువత అనే విషయాన్ని యువత అర్థం చేసుకోగలిగితే, దేన్నైనా సాధించవచ్చన్నారు .
కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు యాదవరాజు, మాజీ కార్పొరేటర్, నిఫా సెక్రెటరీ కొలగాని శ్రీనివాస్, ఎస్సార్ కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ వన్ టూ త్రీ ప్రోగ్రాం ఆఫీసర్స్ ఎలిజిబెత్ , పడాల తిరుపతి , శ్రీనివాస్ రెడ్డి లతోపాటు డాక్టర్ ఉషాఖండల్ , నీఫా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గొల్లె తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.