calender_icon.png 30 October, 2024 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి యువతి సత్యభామలా ఉండాలి..

30-10-2024 03:18:28 PM

వనితా భారత్ లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు జి.కృష్ణ వేణి..

ముషీరాబాద్ (విజయక్రాంతి): నేటి యువతి సత్యభామా వంటి లక్షణాలు ఉండాలని వనితా భారత్ లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు జి.కృష్ణ వేణి అన్నారు. నవభారత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ముషీరాబాద్ ఎస్సీ బాలికల హాస్టల్ లో బుధవారం దీపావళి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సత్యభామా, పురాణాలలోని శక్తిమంతమైన ఒక సాహసికురాలని తెలిపారు. ఈ సందర్భంగా జి.కృష్ణవేణి, జ్యోతి రాజా, డా.హిప్నో పద్మా కమలాకర్ బాలికలకు దీపావళి పటాకులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.  సత్యభామలా నేటి యువతి  ఎటువంటి అడ్డంకులైన  అధిగమించగల శక్తిని పెంచుకోవాలన్నారు. 

క్లబ్ కోశాధికారి జ్యోతి రాజా మాట్లాడుతూ.. తన విలువలను అర్థం చేసుకొని, వాటిని కాపాడుకునే విధంగా బాలికలు ఉండాలన్నారు. సత్యభామ ఎలా ఉండేదో కథ ద్వారా తెలియజేశారు. విజ్ఞానం, విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. నవభారత లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్ మాట్లాడుతూ.. సమాజంలోని అసమానతలపై అవగాహన కలిగి, వాటికి నిరసన తెలిపే ధైర్యం యువతకి ఉండాలన్నారు. కొత్త విషయాలను అన్వేషించే ఉత్సాహం, అవగాహన పెంచుకోవాలని సూచించారు.

సత్యభామా గుణాలను అనుసరించి, యువతికి శక్తి, ధైర్య, సామాజిక బాధ్యతలు ఉంటే సమాజంలో మంచి మార్పు వస్తుందని తెలిపారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. శబ్ధం లేని మందులు కాల్చి, జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం స్వీట్స్ అందజేసి, బాలికలతో బాణాసంచా పేల్చారు. ఈ కార్యక్రమంలో  బాలికల హాస్టల్ హెడ్ భానుప్రియ, తదితరులు  పాల్గొన్నారు.