17-04-2025 12:00:00 AM
శివరాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బీ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘45’. ఉమారమేశ్‌రెడ్డి, ఎం రమేశ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు అర్జున్ జన్యా ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. మేకర్స్ బుధవారం హైదరాబాద్‌లో ఏర్పా టు చేసిన టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఉపేంద్ర మాట్లాడుతూ.. “45’ చిత్రంలో నన్ను చాలా కొత్తగా చూపించారు దర్శకుడు అర్జున్.
ఆయన కథ చెప్పేందుకు వచ్చినప్పుడు నేను ఇంట్లో కాజువల్‌గా ఉన్నా. అదే గెటప్ మూవీలో ఉండాలని చెప్పారు” అన్నారు. హీరో శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ.. “ఈ మూవీ షూ టింగ్ చివరలో నాకు క్యాన్స ర్ అని తెలిసింది. కీమో థెరపీ తీసుకుంటూనే షూ టింగ్ చేశా” అని చెప్పారు. దర్శకుడు అర్జున్ జన్యా మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కు డైరెక్షన్ చేయాలని శివరాజ్‌కుమార్ చెప్పిన మాట తోనే ఈ సినిమాకు దర్శకత్వం చేయగలిగా. ఉపేంద్ర దర్శకులకే దర్శకుడు.
ఈ మూవీని ముందు గా సీజీ, డైలాగ్స్, బీజీఎంతో సహా విజువలైజ్ చేసి, ఆ తర్వాత షూటింగ్ చేశాం. అలా చేస్తే ఒక్క సీన్ వేస్టేజ్ ఉండదు. బడ్జెట్ ఆదా అవుతుంది. తెలుగు దర్శకులూ ఇలా ప్రయ త్నం చేస్తారని ఆశిస్తున్నా’ అన్నారు. నిర్మాత ఎం రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇలాంటి కాన్సెప్ట్ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా రాలేదని చెప్పగలను. ఇప్పుడున్న సామాజిక పరిస్థితులకు 45 లాంటి మూవీ కావాలి. సనాతన ధర్మం గురించి ఈ చిత్రం లో అంశాలుంటాయి’ అని తెలిపారు.