03-03-2025 12:00:00 AM
జగిత్యాల అర్బన్, మార్చి ౨ (విజయక్రాంతి): జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 3న నిర్వహించడం లేదని కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు, జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ పేర్కొన్నారు.