భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని మండల విద్యాధికారి, రచయిత ప్రభు దయాల్ అన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అయిన శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చదువు జీవితాల్లో వెలుగులు నింపుతుందని చెప్పారు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పిల్లల్లో దాగున్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు పలు రకాల కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమన్నారు. విద్యార్థిని విద్యార్థులు చదువులతో పాటు ఆటపాటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండి, పోటీతత్వ నెల వరకు బహుమతులు సాధించాలని సూచించారు.
అనంతరం విద్యార్థులకు చిత్రలేఖనం, భావంతో కూడిన పద్యాల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన చిత్రాలను చూసిన ఆయన అభినందించడంతో పాటు పద్యాలను చెపుతున్న చిన్నారులను వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథపాలకురాలు జి మణి, మృదుల శాఖ గ్రంథా పాలకులు మధుబాబు, నాగన్న, విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాఠకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.