calender_icon.png 27 March, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భగత్ సింగ్ ఆశయ బాటలో నేటి యువత పయనించాలి

23-03-2025 06:35:38 PM

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి, ఎఐఎఫ్డిఎస్ రాష్ట్ర సహాయకార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్..

బెల్లంపల్లి (విజయక్రాంతి): విప్లవ పోరాట యోధుడు భగత్ సింగ్ ఆశయాలను కొనసాగించే దిశలో యువత పయనించాలని ఎం సిపిఐయు జిల్లా కార్యదర్శి, ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, ఎంసిపీఐయు జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ లు పిలుపునిచ్చారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని రామ టాకీస్ ప్రాంతంలో గల భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి 94వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ... భారతమాత దాస్ర్య శృంఖలాలను బద్దలు కొట్టడానికి బ్రిటిష్ వాళ్ళను దేశం నుండి తరిమికొట్టడానికి చిన్నతనంలోనే రాజ్ గురు, సుకుదేవ్ లతో కలిసి బ్రిటిష్ పార్లమెంటుపై బాంబుల వర్షం కురిపించి చిరునవ్వులు చిందిస్తూ ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాన్ని దేశ ప్రజలకు అందించిన విప్లవ యోధుడని కొనియాడారు.

బ్రిటిష్ వాళ్ళను దేశం నుండి పారద్రోలే వరకు విశ్రమించొద్దని యువతకు ప్రబోధించిన వీర కిశోరం, విప్లవ సింహమని కొనియాడారు. భగత్ సింగ్ జీవితం యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. భగత్ సింగ్ భౌతికంగా లేనప్పటికీ అతని మరణం దేశంలో విప్లవానికి శంఖారావాన్ని పూరించిందని తెలిపారు. యువతరాన్ని మేలుకొలిపిన భగత్ సింగ్ ఆశయాలను యువకులు కొనసాగించాలన్నారు. ప్రస్తుతం దేశంలో అధికార మార్పు మాత్రమే జరిగిందని భగత్ సింగ్ కన్న కలలు కళలు గాని మిగిలిపోయాయని వారు అన్నారు. తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చారని, ప్రజల బతుకుల్లో అనువంతైన మార్పు రాలేదని పేర్కొన్నారు. పేదరికం, దోపిడీ పోలేదని, విద్యా, వైద్యం, ఉద్యోగం, దున్నేవానికే భూమి, గిట్టుబాటు ధర, ఆడపిల్లల జీవితాలకు భద్రత మరెన్నో సమస్యలు తీరే దారి కనుచూపుమేరలో కూడా కనిపించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి, అవకాశవాద, ప్రజా వ్యతిరేక పాలన వల్ల దేశంలో బడుగు బలహీన వర్గాలు దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని వారు పేర్కొన్నారు. అమరజీవి భగత్ సింగ్ అందించిన స్ఫూర్తితో యువత పిడికిలెత్తి దోపిడీ పాలనకు చమరగితం పాడాలని కోరారు. జనతా ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించే దిశగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి ఆరేపల్లి రమేష్, సతీష్, పోషన్న, షేక్ మొహమ్మద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బెల్లంపల్లి పట్టణంలోని రామ టాకీస్ సెంటర్ లో ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి ఎంసిపిఐ(యు) పార్టీ జిల్లా కార్యదర్శి, ఎఐఎఫ్డిఎస్ రాష్ట్ర సహాయకార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, పార్టీ, ఎఐఎఫ్డిఎస్, ఎఐఎఫ్దివై జిల్లా నాయకులు పూలమాలలు వేసి ఘనంగా 94వ వర్ధంతిని నిర్వహించారు.

అనంతరం వారు మాట్లాడుతూ... భరతమాత దాస్య శృంఖలాలను బద్దలు కొట్టడానికి, బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుండి తరిమి కొట్టడానికి, నూనూగు మీసాల చిన్న వయసులోనే రాజ్ గురు, సుఖ్ దేవ్ లతో కలిసి బ్రిటిష్ పార్లమెంటుపైన బాంబుల వర్షం కురిపించి చిరునవ్వులు చిందిస్తూ ఉరికొయ్యలను ముద్దాడుతూ ఇంక్విలాబ్ నినాదాన్ని దేశ యువతకు ప్రజలకు అందించి యువతను విప్లవ బాటలో పయనించాలని, బానిసత్వాన్ని ఎదిరించాలని, బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుండి పారద్రోలే వరకు విశ్రమించొద్దని నినదించిన, ప్రబోధించిన వీర కిశోరం, విప్లవ సింహం, యువతరానికి స్ఫూర్తి ప్రదాత భగత్ సింగ్ అని, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయిన ఆయన మరణం ఈ దేశంలో విప్లవానికి శంఖారావాన్ని పూరించిందని, యువతరాన్ని మేల్కోలిపిందని, చైతన్యాన్ని రగిలించిందని, అన్ని వర్గాల ప్రజలను కదిలించిందని, ఎంతోమంది వీరులను, విప్లవకారులను ఆనాటి స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములను చేసిందని, ఆనాటి అమరుల త్యాగ ఫలితమే ఈనాటి స్వాతంత్య్రమని, కాని ఆ అమరుల కలలు ఈనాటి వరకు నెరవేరలేదని, అధికార మార్పు మాత్రమే జరిగిందన్నారు.

 తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చారని, ప్రజల బ్రతుకుల్లో అనువంతైన మార్పు రాలేదని, పేదరికం, దోపిడి పోలేదని, విద్య, వైద్యం ఉద్యోగం, దున్నేవానికి భూమి, గిట్టుబాటు ధరలు, ఆడపిల్లల జీవితాలకు భద్రత ఇంకెన్నో మరెన్నో సమస్యలు తీరే దారి కనుచూపుమేరలో కానరావడం లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి, అవకాశవాద, ప్రజావ్యతిరేక పాలన వల్ల ఈ దేశంలోని బడుగు, బలహీన వర్గాలు రెక్కాడితేనే డొక్కాడే కష్టజీవులు, రైతులు, వ్యవసాయ కూలీలు, అన్ని వర్గాల ప్రజలు ప్రతిరోజు పడరాని పాట్లు పడుతున్నారని, బ్రతుకు బండి లాగలేకపోతున్నారని, అందుకే అమరజీవి భగత్ సింగ్ అందించిన స్ఫూర్తితో యువత నడుము కట్టాలని, పిడికిలెత్తాలని, ఈ దోపిడి పాలనకు చరమగీతం పాడాలని జనతా ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలోఎంసిపిఐ(యు) పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఎఐఎఫ్డివై రాష్ట్ర ఉపాధ్యక్షులు పసులేటి వెంకటేష్, ఎంసిపిఐ(యు) పార్టీ పట్టణకార్యదర్శి ఆరెపల్లి రమేష్, సతీష్, పోషన్న,షేక్ మహ్మద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.