calender_icon.png 20 November, 2024 | 10:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు వేములవాడకు సీఎం

20-11-2024 02:27:35 AM

  1. రూ.127.65 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  2. నిర్వాసితులకు ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ
  3. గుడి చెరువు ప్రాంగణంలో బహిరంగ సభ 
  4. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ శ్రీనివాస్

సిరిసిల్ల, నవంబర్ 19 (విజయక్రాంతి): సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయానికి బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి రానున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాక సందర్భంగా వేములవాడ గుడి చెరువు ప్రాంగణంలో సభ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యవేక్షణలో పూర్తి చేయగా, మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.

కాంగ్రెస్ సర్కారు వేములవాడలో పలు అభివృద్ధి పనుల కోసం రూ.127.65 కోట్ల నిధులు విడుదల చేసింది. అందుకు సంబంధించిన అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అందులో రాజన్న ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ వరకు నూతన మురుగు కాల్వ నిర్మాణం ఉన్నాయి.

మిడ్ మానేరు ముంపు గ్రామాల నిర్వాసితుల కోసం 4,696 ఇళ్ల మంజూరుకు రూ.230 కోట్లు  ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా మంజూరు పత్రాలను అందజేయనున్నారు. ఉపాధి కో సం గల్ఫ్ వెళ్లిన వలస కార్మికులు పలు కారణాలతో అక్కడ మృతిచెందిన 17 మంది కు టుంబాలకు రూ.83 లక్షల చెక్కులను అందజేయనున్నారు.

సిరిసిల్ల పట్టణంలో జిల్లా పోలీస్ అధికారి కార్యా లయాన్ని వర్చువల్‌గా సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం గుడి చెరువు ప్రాంగ ణంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడనున్నారు. ఈ సభకు డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్, తుమ్మల నాగేశ్వరావు, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ హాజరుకానున్నారు.