సీఎంవో అధికారులతో పాటు రైతులు, నేత సంఘాలతో సమీక్ష
హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎంవో అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైసీ (టీజీసీ)తో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు రైతు నేస్తంలో భాగంగా 500 రైతు వేదికల సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.