calender_icon.png 26 October, 2024 | 12:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటితరం జనకుల ప్రతినిధిగా సుహాస్

05-07-2024 12:05:00 AM

ఏ తండ్రి అయినా తన పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలనుకుంటాడు. తాను అలాగే ఉండాలని భావించిన ఓ యువకుడు, తండ్రి అయ్యేటపుడు భార్య ప్రసవం కోసం ఉత్తమ ఆసుపత్రి మొదలుకొని పుట్టే బిడ్డలకు అన్నీటిలో బెస్ట్ ఇవ్వాలని అనుకున్నాడు.  అయితే ఆ ‘తీపికబు రు’ కోసం కాచుకుని ఉన్న తన కుటుంబానికి మాత్రం ఎదురుచూపులనే మిగిల్చాడు. ఆ కథేంటన్నది తెరపై చూడండి అంటున్నారు సుహా స్. ఆయన కథానాయకుడిగా సందీ ప్ రెడ్డి బండ్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘జనక అయితే గనక’.

దిల్ రాజు ప్రొడ క్షన్స్ సంస్థ నుండి త్వరలో థియేటర్లలోకి రానున్న ఈ సినిమా టీజర్‌ను గురువారం ప్రభాస్ విడుదల చేశా రు. సంగీర్తన విపిన్ కథానాయికగా కనపడనున్న ఈ సినిమాలో గోపరాజు రమణ, వెన్నెల కిశోర్, రాజేంద్ర ప్రసాద్ ఇతర తారాగణం. మధ్య తరగతి కుటుంబాల్లో  పిల్లలు కనడం, పెంపకం వంటి విషయాల్లో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి అన్న అంశంతో  తెరకెక్కిన ఈ సినిమాలో నేటి తరం జనకుల (తండ్రుల) ప్రతినిధిగా సుహాస్ కనపడనున్నారు.