27-02-2025 01:31:09 AM
కరీంనగర్, ఫిబ్రవరి26 (విజయక్రాంతి): మెదక్---నిజామాబాద్--కరీంనగర్--ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యా య నియోజకవర్గాల ఈనెల 27న జరగనున్న పోలింగ్ ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎన్నికల మెటీరియల్, బ్యాలెట్ బాక్సుల డిస్ట్రిబ్యూషన ప్రక్రియ బబుధవారం కొనసాగింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు.
ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రిసైడింగ్ అధికారులకు సిబ్బందికి, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది, ఉపాధ్యాయ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు 3లక్షల 55 వేల 159 కాగా. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 27 వేల 88 మంది.
అన్ని జిల్లాలలో కలిపి 499 గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్లు, 274 టీచర్స్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చెశారు. . 93 కామన్ పోలింగ్ స్టేషన్లు ( గ్రాడ్యుయేట్స్, టీచర్స్) ఏర్పాటు చేశారు.. మొత్తంగా అన్ని జిల్లాల్లో 773 పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు..
కరీంనగర్ జిల్లాలో..
కరీంనగర్ జిల్లాలో 71 వేల 545 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా, 4 వేల 305 మంది టీచర్స్ ఓటర్లు ఉన్నారు. మొత్తం 103 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరుగనుంది, ఇందులో 85 గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్లు కాగా, 18 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.. రెవెన్యూ డివిజన్లో వారీగా పరిశీలిస్తే కరీంనగర్ రెవెన్యూ డివిజన్లో 69 గ్రాడ్యుయేట్, 12 టీచర్ పోలింగ్ స్టేషన్లు , హుజరాబాద్ రెవెన్యూ డివిజన్లో 16 గ్రాడ్యుయేట్ 6 టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
కరీంనగర్ జిల్లాలో మొత్తం 103 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 312 మంది పోలింగ్ ఆఫీసర్లు, 36 మంది రిజర్వు సిబ్బంది, మొత్తం 451 మంది పోలింగ్ విధుల్లో ఉన్నారు. జిల్లాలో 36 మంది మైక్రో అబ్జర్వర్లు, 12 మంది సెక్టార్ ఆఫీసర్లు ఉన్నారు.
గుర్తింపుకార్డు తప్పని సరి
ఈ ఎన్నికలలో ఓటర్లు ఓటు వేసేందుకు ఓటరు గుర్తింపు కార్డుతో పాటు, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని చూపించి వారి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఈ నెల 27న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన అనంతరం అన్ని జిల్లాల నుండి బ్యాలెట్ బాక్సులను కట్టుది ట్టమైన భద్రత మధ్య కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో గల రిసెప్షన్ సెంటర్‌కు తరలిస్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత తో 144 సెక్షన్ అమలు ఉంటుంది . సీసీ కెమెరాల నిఘా తో పాటు కంట్రోల్ రూమ్ నుండి నిరంతర పర్యవేక్షణ ఉంటుంది
ప్రత్యేక సెలవు
గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నమోదిత ఓటర్లుగా ఉన్న కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల ఉద్యోగులు తమ ఓటు వినియోగించుకునేందుకు ప్రత్యేక సెలవు వర్తిస్తుంది.. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థ లేదా ఇతర అన్ని ప్రైవేట్ మేనేజ్మెంట్, అథారిటీలలో పని చేస్తూ గ్రాడ్యుయేట్ ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు, కార్మికులు సైతం వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు యాజమాన్యాలు అనుమతి, వెసులుబాట్లు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.