- సావిత్రీబాయి ఆశయ సాధనే ధ్యేయం
- ఆమె జయంతి రోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం
- ఏటా ఘనంగా వేడుక నిర్వహిస్తాం
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన
హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): సావిత్రీబాయి ఫూలే ఆశయ సాధనే ధ్యేయమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సావిత్రీబాయి జయంతి పండుగ రోజని, ఏటా జనవరి 3న ఆమె జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించామని స్పష్టం చేశా రు. ఏటా వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు.
మహిళలు కచ్చితంగా చదువుకోవాలని జీవితాం తం సేవలు అందించారని కొనియాడారు. మహిళా విద్యకు ఆద్యురాలిగా ఆమె నిలిచారని పేర్కొన్నారు. ఆమె త్యాగాలు వెలకట్టలేనివని, అణగారిన వర్గాల కోసం తమ జీవితాన్ని అర్పించారన్నారు.
లింగ వివక్ష, కుల అసమా తనలపై తిరుగులేని పోరాటం చేశారన్నారని పేర్కొన్నారు. ఆమె స్ఫూర్తితో నే రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఆడబిడ్డలు అన్ని రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా ప్రణాళికలు రచిస్తున్నామని స్పష్టం చేశారు.