calender_icon.png 18 April, 2025 | 11:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం

05-04-2025 08:17:18 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలోని కొలువై ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఆలయ ప్రధాన అర్చకులు కొండపాక మురళీకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు  స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో ఆలయ ఆవరణ లో ఉదయం 6గం.లకు సుప్రభాత సేవ, ఆరాధన, ప్రాభోదాకి, మంగళ శాసనము, ద్వార తోరణం, ద్వజకుంభ ఆరాధనలు, మూర్తి కుంభ ఆరాదణ, అగ్ని ప్రతిష్ఠ, మూల మంత్ర, మూర్తి మంత్రహోమాలు నిర్వహించారు. పూర్ణాహుతి, ద్వజారోహణం సంతానం లేని దంపతులకు గరుడ ముద్దలు అందించారు.

స్వామి వారికి మంగళ స్నానములు, అనంతరం భక్తులకు ప్రసాదాలు అందించారు. సాయంత్రం 6 గంటలకు విష్ణు సహస్రనామపారాయణం, అగ్నిముఖము, మూర్తి గాయత్రి హోమాలు, దేవతాహ్వనము, పూర్నహుతి, బలిహరణము, నివేదన, హారతి,  అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందించారు. నేడు తెల్లవారుజామున  ప్రత్యేక పూజ కార్యక్రమాలు ద్వార తోరణ, ధ్వజకుంభ ఆరాదనలు, మూల మంత్ర హవనాలు, ఆంతరంగీక యాగశాల అర్చన, శ్రీ సీతారాముల కళ్యాణం ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. కళ్యాణం అనంతరం మహ అన్న ప్రసాద వితరణ ఉంటుందని, సాయంత్రం మూర్తి కుంభ ఆరాదన, అర్చనలు, మూలమంత్ర హవనములు, పూర్ణాహుతి, తీర్ధ ప్రసాద గోష్టి, కోలాటములతో ఊరేగింపు  నిర్వహిస్తారు.

7వ తేదీ ఉదయం ద్వారా తోరణం ధ్వజ కుంభ ఆరాధనలు శ్రీ లక్ష్మీ హోమము మహా పూర్ణాహుతి మూర్తి కుంభ ఉత్వాసన కుంభ ప్రోక్షణ శ్రీ చక్రస్నానం (అవబృంద స్నానం), నివేదన, తీర్థ ప్రసాద గోష్టి, సాయంత్రం 4 గంటలకు ధ్వజ ఉద్వాసనం శ్రీ పుష్పయాగం ద్వాదశ ఆరాధనలు, సప్తవరణం మహాదాశీర్వచనం, పవళింపు సేవ. ఉత్సవ పరి సమాప్తితో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దౌపాటి కృష్ణమూర్తి, మొండిద్దుల వెంకటేశ్వర రెడ్డి, ఎడమ కంటి పిచ్చిరెడ్డి, పాలెం లక్ష్మిరెడ్డి, బూసి రెడ్డి వీరారెడ్డి, సింగం రెడ్డి అంకిరెడ్డి సోము వెంకటసుబ్బారెడ్డి, సోము పిచ్చిరెడ్డి, గంగాధర్ రావు, మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.