calender_icon.png 29 December, 2024 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడే కొమురెల్లి మల్లన్న కల్యాణం

29-12-2024 02:59:19 AM

  1. రాష్ట్రం నలుమూలల నుంచి రానున్న భక్తులు
  2. హాజరు కానున్న మంత్రి పొన్నం ప్రభాకర్ 

సిద్దిపేట, డిసెంబర్ 28 (విజయక్రాంతి): మల్లన్న కల్యాణానికి కొమురెల్లి ముస్తాబైం ది. సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలోని ఆలయం లో ఆదివారం జరుగునున్న కల్యాణ ఉత్స వాలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం కల్యాణ వేడుక జరుగుతుంది. ఏటా మార్గ శిర మాసం చివరి ఆదివారం కల్యాణం జరు పుతారు.

ఆదివారం ఉదయం 10.45 గంట లకు వరుడు మల్లికార్జునస్వామి తరఫున పడగన్నగారి వంశస్థులు, వధువులు బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ తరఫున మహాదేవ వంశస్థులు పెండ్లి పెద్దలుగా వ్యవహరించి కల్యాణం జరిపిస్తారు.

ఆదివారం తెల్లవారు జామున మొదలై కల్యాణం అనంతరం రుద్రాభిషేకం రాత్రి ౭  గంటలకు రథోత్స వం, మరుసటి రోజు ఉదయం ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకు లక్ష బిల్వర్చన నిర్వహిస్తారు. కొమరవెల్లి మల్లన్న కల్యాణోత్సవానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకాను న్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు.