calender_icon.png 30 October, 2024 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడే మూడో విడత దోస్త్ సీట్ల కేటాయింపు

06-07-2024 01:32:11 AM

ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): నేడు మూడో విడత దోస్త్ సీట్లను కేటాయించనున్నారు. మొద టి, రెండో వితల్లో కలిపి మొత్తం ఇప్పటి వరకు 93,214 మంది విద్యార్థులు డిగ్రీలో సీట్లు పొందినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. సీటు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసినట్లు పేర్కొన్నారు. మూడో విడతకు మొత్తం 66,976 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, 80,312 వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్‌కు సమానంగా ఉద్యోగ అవకాశాలు లభించే కోర్సులు డిగ్రీలోనూ ఉన్నట్లు ఆయన వివరించారు. ఫస్టియర్ విద్యార్థులకు ఈనెల 15 నుంచి లేదా నెలాఖరు నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు.