- తల్లి పనిచేసిన చోటే వైస్ చైర్మన్ స్థాయికి ఎదిగిన విజయ్‌కుమార్
- సామాజిక సేవతో ప్రజల్లో గుర్తింపు
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ మార్కెట్ నూతన కమిటీ సభ్యులు గురువారం ప్రమాణం స్వీ కారం చేయనున్నారు. వైస్ చైర్మన్‌గా పెద్ద విజయ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయ్‌కుమార్ కడు పేదరికం ను ంచి వైస్ చైర్మన్ స్థాయికి ఎదిగారు. తన తల్లి ప్రమీలమ్మ ఇదే మార్కెట్ యార్డులో చాటకూలీ చేసి కుటుంబాన్ని పోషించింది. తన తల్లి కష్టాన్ని చూసి విజయ్‌కుమార్ ఎల్లప్పు డు ఇతరులకు తోచిన సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.
అందులో భాగంగా తన తండ్రి వెంకట్రాములు పేరుమీద 100 మందికి మూడు సంవత్సరాల పాటు రూ.200 చొప్పున ఫించన్లు ఇచ్చారు. 50 మందికిపైగా నిరుపేదలకు సిలిండర్లు ఇప్పించారు. పలు కాలనీల్లో తాగునీటి బోర్లు వేయించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఛైర్మన్, పాలకవర్గ సభ్యులతో కలిసి వందకు వంద శాతం న్యాయం చేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. రైతులు ఎల్లప్పుడు తమ పాలకవర్గాన్ని స్మరించుకునేలా పనిచేసి చూపిస్తామన్నారు.