calender_icon.png 24 October, 2024 | 9:58 AM

నేడు బల్కంపేట ఎల్లమ్మతల్లి కల్యాణోత్సవం

09-07-2024 04:11:25 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 8 (విజయక్రాంతి): బల్కంపేట ఎల్లమ్మతల్లి కల్యాణ మహోత్సవాన్ని నేడు(మంగళవారం) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవా లకు ఆహ్వానిస్తూ ఎండోమెంట్ అధికారులు సీఎస్ శాంతికుమారికి సోమవారం ఆహ్వాన పత్రిక అందజేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా  సోమవారం అమ్మవారిని పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ఆలయ అర్చకులు ఎల్లమ్మతల్లి కల్యా ణాన్ని నిర్వహించబోతున్నారు.