calender_icon.png 15 January, 2025 | 5:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు జావెలిన్ త్రో ఫైనల్

08-08-2024 02:04:38 AM

పారిస్: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో నేడు పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ జరగనుంది. ఫైనల్లో ఢిపెండింగ్ చాంపియన్, భారత అథ్లెట్  నీరజ్ చోప్రా ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన నీరజ్ మరోసారి పసిడిపై గురిపెట్టాడు. క్వాలిఫికేషన్‌లో తొలి ప్రయత్నం లోనే బరిసెను 89.34 మీటర్లు విసిరిన నీరజ్ తొలి స్థానంలో నిలిచాడు. రెండు గ్రూపుల్లో నుంచి మొత్తంగా 12 మంది అథ్లెట్లు ఫైనల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా నీరజ్‌కు.. వెబర్, పీటర్స్, అర్షద్ నదీమ్ నుంచి గట్టి పోటీ ఉండనుంది. ఇక భారత హాకీ జట్టు ఇవాళ కాంస్య పతక పోరు కోసం సిద్ధమైంది.