calender_icon.png 24 January, 2025 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు నార్సింగిలో బర్రెల జాతర

24-01-2025 12:00:00 AM

  • వివిధ రాష్ట్రాల నుంచి పశువుల రాక
  • అన్ని ఏర్పాట్లు పూర్తి : మార్కెట్ కమిటీ చైర్మన్:  కోట వేణుగౌడ్ 
  • సుమారు వెయ్యి బర్రెలు రావొచ్చని అంచనా  

రాజేంద్రనగర్, జనవరి2౩: నార్సింగిలో శుక్రవారం గేదెల జాతర నిర్వహించను న్నారు. వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 1000 గేదెలు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, పంజాబ్,  మహారాష్ట్ర, గురుగావ్ తదితర ప్రాంతాల నుంచి గేదెలను వ్యాపారులు తీసుకురానున్నారు. గేదెల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ కోట వేణు గౌడ్ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో గురువారం ఆయన మార్కెట్ ఆవరణలో అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. గేదెల జాతరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా అన్ని వసతులు సమకూర్చినట్లు ఈ సందర్భంగా  వివరించారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు గోవు పూజతో కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ఆయన తెలియజేశారు.

రాష్ట్ర ముదిరాజ్ కార్పొ రేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కాంగ్రెస్ సీనియర్ నేత ముంగి జైపాల్ రెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. గేదెల జాతరను విజయవంతం చేయాలని వేణు గౌడ్ పిలుపునిచ్చారు.